Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎల్పీజీ సిలిండర్‌ బుకింగ్‌ నిబంధనల్లో మార్పులు.వినియోగదారులకు భారీ ఊరట.

Author Mohammad azeem | 07 Sep 2026, 11:00 PM |
ఎల్పీజీ సిలిండర్‌ బుకింగ్‌ నిబంధనల్లో మార్పులు.వినియోగదారులకు భారీ ఊరట.

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న ఎల్పీజీ రీఫిల్‌ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ ప్రాంతాల ఎల్పీజీ వినియోగదారులకు ఇంతకాలం సిలిండర్ బుక్ చేసుకోవాలంటే 45 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ఉండేది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ నిరీక్షణకు తెరపడింది. ఇకపై గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని అన్ని గృహ వినియోగదారులకు ఒకే రకంగా కేవలం 25 రోజుల నిబంధన వర్తించనుంది. దీంతో వినియోగదారులు 25 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశం లభించనుంది.