Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బ్రిడ్జిపై గుంతలు.. వాహనదారులకు తప్పని తిప్పలు

Author TELANGANA ADDA NEWS | 08 Sep 2026, 05:41 PM |
బ్రిడ్జిపై గుంతలు.. వాహనదారులకు తప్పని తిప్పలు

బ్రిడ్జిపై గుంతలు.. వాహనదారులకు తప్పని తిప్పలు

బోయిన్పల్లి: బోయిన్పల్లి నుంచి కొదురుపాక వెళ్లే ప్రధాన రహదారిలో బోయిన్పల్లి గ్రామ శివారులోని బ్రిడ్జిపై భారీగా గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాలు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.

బ్రిడ్జిపై గుంతలు.. వాహనదారులకు తప్పని తిప్పలు - Additional Image

ప్రధాన రహదారి కావడంతో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గుంతలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చి, రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి