Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నిమ్స్ ఆసుపత్రిలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పరామర్శ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది

Author Mohammad azeem | 08 Sep 2026, 07:35 PM |
నిమ్స్ ఆసుపత్రిలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పరామర్శ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట మాజీ డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డిని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సహచర మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి పరామర్శించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జరిగిన దాడిలో నర్సారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నర్సారెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన నేతలు.. కాంగ్రెస్ పార్టీ తూంకుంట నర్సారెడ్డికి అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.