Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దళితబంధు లబ్ధిదారుల అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా పోలేదు: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్

Author TELANGANA ADDA NEWS | 09 Sep 2026, 07:51 PM |
దళితబంధు లబ్ధిదారుల అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా పోలేదు: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్

దళితబంధు లబ్ధిదారుల అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా పోలేదు: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
దళిత బంధు నిధుల విషయంలో దళితులను మోసం చేసి వారికి నిధులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా కొత్త డ్రామాకి తెరలేపుతూ, దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్ లో ఉన్న 50 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారంటూ కౌశిక్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అబద్ధాలు ఆడటంలో కౌశిక్ రెడ్డిని మించిన వారు లేరని విమర్శించారు.
లబ్ధిదారుల అకౌంట్లలో ఉన్న డబ్బులను వెనక్కి తీసుకున్నామని కౌశిక్ రెడ్డి నిరూపించకపోతే, ఆయన తన పదవికి రాజీనామా చేసి, ముక్కు నేలకు రాసి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం దళితులను వాడుకున్నారే తప్ప, నిజంగా వారి సంక్షేమం కోసం ఆలోచించేవారైతే ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఆయన ఎందుకు పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయించలేదని ప్రశ్నించారు. మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ, కౌశిక్ రెడ్డి దళిత సమాజానికి వ్యతిరేకమని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని, త్వరలోనే నిధులు విడుదల చేస్తామని ఆయన భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.