Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు.. రేకుర్తిలో విగ్రహానికి నివాళులర్పించిన మేయర్ కొలగాని శ్రీనివాస్

Author TELANGANA ADDA NEWS | 09 Sep 2026, 07:55 PM |
ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు.. రేకుర్తిలో విగ్రహానికి నివాళులర్పించిన మేయర్ కొలగాని శ్రీనివాస్

ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు.. రేకుర్తిలో విగ్రహానికి నివాళులర్పించిన మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

పద్మభూషణ్ కాళోజి నారాయణ రావు 112వ జయంతి సందర్భంగా రేకుర్తి 19వ డివిజన్‌లోని కాళోజి విగ్రహానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణ యాస, భాషను తన రచనలతో ఎలుగెత్తి చాటిన గొప్ప ప్రజాకవి కాళోజి నారాయణ రావు అని మేయర్ కొనియాడారు. తెలంగాణ భాషలోని మధురత్వాన్ని ప్రపంచానికి చాటిన ఆయనను నేటితరం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్, కాళోజీ నగర్ కాలనీల అధ్యక్షులు రమణారెడ్డి నారాయణ రెడ్డి మరియు పలువురు డివిజన్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి