Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కమలాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి

Author TELANGANA ADDA NEWS | 10 Sep 2026, 07:27 PM |
కమలాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి

కమలాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి

కమలాపూర్, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని కమలాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, సర్పంచ్ పబ్బు సతీష్, శనిగరం సర్పంచ్ కొత్తపల్లి రాజు, సాంబరావు, కమలాపూర్ 13వ వార్డు సభ్యురాలు ఓసుకుల కీర్తన తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు, దొరల అకృత్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నేటి యువత సామాజిక న్యాయం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.