Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

Author TELANGANA ADDA NEWS | 11 Sep 2026, 05:15 PM |
ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

టేక్మాల్, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా ప్రతినిధి):
దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ద్వారా గుర్తింపు కల్పించినట్లుగానే, ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) కేటాయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని టేక్మాల్ మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. భూమి కలిగిన ప్రతి రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం తదుపరి విడతల ప్రయోజనాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రైతు భరోసా, రుణమాఫీ, పత్తి, ధాన్యం కొనుగోలు, యూరియా, ఇతర ఎరువుల బుకింగ్ వంటి పలు సేవలు, పథకాల కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవసరమని తెలిపారు.

రైతులు తమ ఆధార్ కార్డు, భూ యాజమాన్య పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ తీసుకుని తమ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా సమీప మీ సేవ కేంద్రాన్ని సంప్రదించి వెంటనే ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్దు తదితరులు పాల్గొన్నారు.