Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం సీఎం రేవంత్ రెడ్డికి మట్టి వినాయకుడిని అందజేసిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు, మంత్రి పొన్నం ప్రభాకర్

Author Mohammad azeem | 12 Sep 2026, 07:23 PM |
మట్టి గణపతిని పూజిద్దాం  పర్యావరణాన్ని కాపాడుకుందాం సీఎం రేవంత్ రెడ్డికి మట్టి వినాయకుడిని అందజేసిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు, మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
​వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావుతో కలిసి మట్టి వినాయకుడి విగ్రహాన్ని అందజేశారు.
​ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా రసాయన విగ్రహాలకు బదులు మట్టి వినాయక విగ్రహాలనే ఉపయోగించాలని, వాటి వాడకాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా మట్టి గణపతులను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి మరియు సహచర శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.