Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బీసీల సమస్యలపై పీసీసీ చీఫ్‌కు వర్ధన్నపేట కాంగ్రెస్ నేతల వినతి

Author TELANGANA ADDA NEWS | 12 Sep 2026, 08:46 PM |
బీసీల సమస్యలపై పీసీసీ చీఫ్‌కు వర్ధన్నపేట కాంగ్రెస్ నేతల వినతి

ప్రజా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వమే నిదర్శనం!

బీసీల సమస్యలపై పీసీసీ చీఫ్‌కు వర్ధన్నపేట కాంగ్రెస్ నేతల వినతి

బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌ను ఘనంగా సత్కరించిన బొక్కల ప్రమోద్, కుల్ల యాకాంతం

వర్ధన్నపేట, సెప్టెంబర్ 12 (తెలంగాణ అడ్డా ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌ను వర్ధన్నపేట అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బొక్కల ప్రమోద్, వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు కుల్ల యాకాంతం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం వెంకట్రావుపల్లి గ్రామానికి సంబంధించిన సమస్యలతో పాటు బీసీలకు సంబంధించిన పలు సమస్యలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కుల్ల యాకాంతం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. గతంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి వార్డు స్థాయి ప్రజాప్రతినిధుల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనను ప్రజల గడప వద్దకు తీసుకువస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి ఉండేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ సామాన్య కార్యకర్తలు, ప్రజలకు సైతం అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. ఇదే ప్రజా పాలనకు నిదర్శనమని అన్నారు.

ప్రజా సమస్యలను నేరుగా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే కాంగ్రెస్ నాయకుల లక్ష్యమని యాకాంతం తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.