Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కోడిపందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి ఆరుగురి అరెస్ట్

Author Mohammad azeem | 13 Sep 2026, 09:22 PM |
కోడిపందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి ఆరుగురి అరెస్ట్

రామగుండం ప్రతినిధి/ తెలంగాణ అడ్డా:
​రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో అందిన విశ్వసనీయ సమాచారంతో రామగుండం కమిషనరేట్ నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు రమేష్, లచ్చన్న, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది, కన్నెపల్లి ఎస్‌ఐ విక్రమ్ పోలీసులతో కలిసి కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామశివారులో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై సంయుక్తంగా దాడి నిర్వహించారు.
​ఈ దాడిలో కోడి పందేలు నిర్వహిస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ. 2,100 నగదును స్వాధీనం చేసుకున్నారు.అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వివరాలు:రామ్‌టెంకి వినోద్ (25), తండ్రి: రామ్‌చందర్, వృత్తి: వ్యవసాయం, చంద్రపల్లి గ్రామం, దహెగాం మండలం.పాలే సుధాకర్ (26), తండ్రి: శంకర్, వృత్తి: ఎలక్ట్రీషియన్, చిన్నరాసిపల్లి గ్రామం, దహెగాం మండలం.
​సుదమళ్ల రవి (26), తండ్రి: భీమయ్య, వృత్తి: ఆటో డ్రైవర్, పి.పి.రావుపల్లి గ్రామం, దహెగాం మండలం.గట్లే పవన్ (21), తండ్రి మధునయ్య, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్, పి.పి.రావు కాలనీ, దహెగాం మండలం.బోగే శేఖర్ (32), తండ్రి: చిన్నయ్య, వృత్తి: ఆటో డ్రైవర్, మాదవెల్లి గ్రామం, కన్నెపల్లి మండలం.
​పాలే అశోక్ (30), తండ్రి: ఇస్తారి, వృత్తి: వ్యవసాయం, చిన్నరాత్‌పల్లి గ్రామం, దహెగాం మండలం.అదుపులోకి తీసుకున్న ఆరుగురు వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న సామగ్రి మరియు నగదుతో సహా తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. కోడి పందేలు, జూదం, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.