Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయకుడి ప్రతిష్ఠకుటుంబ సమేతంగా పాల్గొన్న చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు

Author TELANGANA ADDA NEWS | 14 Sep 2026, 01:03 PM |
మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయకుడి ప్రతిష్ఠకుటుంబ సమేతంగా పాల్గొన్న చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు

మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయకుడి ప్రతిష్ఠ

నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వినాయక పూజ

కుటుంబ సమేతంగా పాల్గొన్న చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు

ఇవి కూడా చదవండి

వేములవాడ, సెప్టెంబర్ 14 (తెలంగాణ అడ్డా ప్రతినిధి):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వినాయక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నూతన మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన అనంతరం తొలిసారిగా కార్యాలయ ఆవరణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలు చేపట్టే ప్రతి పనిలో విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలని ప్రార్థించినట్లు తెలిపారు. పాడిపంటలు సకాలంలో పండి రైతులకు, ప్రజలకు లాభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ వినాయక నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొక్కుల బాలకృష్ణ, కొండ రాజశేఖర్, తోట రాజు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ సుకుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.