Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క - గణిత ఉపాధ్యాయుడి నియామకానికి ఆదేశం

Author | 17 Sep 2026, 06:37 PM | Politics, TELANGANA
విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క - గణిత ఉపాధ్యాయుడి నియామకానికి ఆదేశం

ఖమ్మం జిల్లా బ్యూరో / తెలంగాణ అడ్డా:
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనం వారి కృష్ణాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆకస్మికంగా సందర్శించి, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సదుపాయాలు, విద్యార్థుల చదువు మరియు భోజన వసతుల గురించి ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమంతో పాటు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. పాఠశాలలో అమలవుతున్న ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలపై ఆరా తీయగా, భోజనం రుచికరంగా ఉంటున్నాయని విద్యార్థులు సంతోషంగా తెలిపారు.
ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా తమ పాఠశాలకు గణిత ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులు కోరగా.. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం, పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిని వెంటనే నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
అనంతరం మధిర నియోజకవర్గంలో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణ పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాలల నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, వచ్చే నవంబర్ మొదటి వారంలోగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క - గణిత ఉపాధ్యాయుడి నియామకానికి ఆదేశం - Additional Image