Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.. రూ. 2.5 లక్షల లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డ అధికారులు

Author | 17 Sep 2026, 09:31 PM | Array
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.. రూ. 2.5 లక్షల లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డ అధికారులు

రంగారెడ్డి బ్యూరో / తెలంగాణ అడ్డా:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్-ట్రెజరీ ఆఫీస్‌లో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు నిర్వహించిన సంచలన ట్రేప్ ఆపరేషన్‌లో సబ్-ట్రెజరీ ఆఫీసర్ మడిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కావలి అనురాధతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి వడ్డే జంగయ్య అలియాస్ చిన్న ఏసీబీ అధికారులకు చిక్కారు.
బాధితుడి నుంచి ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం రూ. 2,50,000 లంచం డిమాండ్ చేయగా, ఇందులో రూ. 1,00,000 ముందస్తు మొత్తాన్ని (part payment) తీసుకుంటూ వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సబ్-ట్రెజరీ ఆఫీసర్ తన వాటాగా రూ. 50,000 నేరుగా తీసుకోగా, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సూచనల మేరకు ప్రైవేట్ వ్యక్తి మిగతా రూ. 50,000 స్వీకరించినట్లు తేలింది.
బాధితుడికి సంబంధించిన రూ. 23,25,390 సస్పెన్షన్ పీరియడ్ సెలరీ బిల్లులు మరియు రూ. 4,29,000 పోస్ట్-రిటైర్మెంట్ పెన్షన్ అడ్జస్ట్మెంట్ ఏరియర్స్‌ను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 1,00,000 నల్లధనం రికవరీ చేయబడింది. ముగ్గురు నిందితులను నాంపల్లిలోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల ప్రిన్సిపాల్ స్పెషల్ జడ్జి ఎదుట జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నట్లు, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఏసీబీ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1064
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 నంబర్‌ను సంప్రదించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.