Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Author | 17 Sep 2026, 11:50 PM | TELANGANA
భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ / తెలంగాణ అడ్డా:
వేములవాడ పట్టణంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జన వేడుకలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె తో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడలో మొత్తం 311 గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు జరుపుకుంటూ విగ్రహాలను వైభవంగా తరలించాలని సూచించారు. ఉత్సవాలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని కోరారు.
అధికారులకు జారీ చేసిన ఆదేశాలు మరియు ఏర్పాట్లు:
నిమజ్జన ప్రాంతంలో అవసరమైన స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్థం వైద్య సేవలు, అగ్నిమాపక శాఖ సేవలు అందేలా చూడాలని, తగినన్ని క్రేన్లను అందుబాటులో ఉంచాలని మరియు పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో గుడి చెరువు బండ్ పార్క్‌ను దాదాపు రూ. 12 కోట్లతో అద్భుతంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని, ఇటీవల మంత్రులు దీనిని ప్రారంభించారని గుర్తుచేశారు. వేములవాడ పట్టణ వాసులతో పాటు భక్తులు, పిల్లలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తున్నారని తెలిపారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ కే.ఎస్.బి. కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ జయంత్, మున్సిపల్ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.