Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉట్నూర్‌లో వరుస దొంగతనాలకు చెక్ – ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్ట్

Author | 18 Sep 2026, 10:07 AM | Crime, TELANGANA
ఉట్నూర్‌లో వరుస దొంగతనాలకు చెక్ – ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లా బ్యూరో / తెలంగాణ అడ్డా:
ఉట్నూర్‌లో గత 8 నెలలుగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ వివరాలను వెల్లడించారు.
చోరీల తీరు: నిందితులు ప్రధానంగా 3 ఇళ్లలో చోరీ చేసి 3 తులాల బంగారం, 47 తులాల వెండి మరియు రూ. 30 వేల నగదును అపహరించారు. కేవలం ఇళ్లే కాకుండా ట్రాన్స్‌ఫార్మర్ల రాగి తీగలు, కాపర్ కాయిల్స్ మరియు సోలార్ పరికరాలను కూడా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 6 దొంగతనాల కేసుల్లో మోనూ, షాజిద్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
సహకరించిన వారు మరియు కొనుగోలుదారులు: దొంగసొత్తు విక్రయానికి షమ్షూ, మొబీన్, హతిక్ సహకరించగా; బంగారం, వెండి వస్తువులను ప్రభాకర్, చందన్, నారోజి విజయ్ కొనుగోలు చేశారు. అలాగే వీరికి మోహన్, జయవంత్, శివరాత్రి శ్రీనివాస్ సహకరించినట్లు తేలింది.
దొంగతనాలకు పాల్పడేవారితో పాటు, దొంగసొత్తును కొనుగోలు చేసే మరియు విక్రయించే వారిపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.

ఉట్నూర్‌లో వరుస దొంగతనాలకు చెక్ – ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్ట్ - Additional Image