Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

Author | 18 Sep 2026, 08:47 PM | Politics, TELANGANA
రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో / తెలంగాణ అడ్డా:
​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాల్వంచ ఎస్టీ బాలుర హాస్టల్‌లో వార్డెన్‌గా, రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భుక్యా వాలుసింహ రూ.14 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
​లంచం డిమాండ్ నేపథ్యం: హాస్టల్‌లో పనిచేసే సిబ్బంది ఒకరు ఆగస్టు నెలలో ఆరు రోజుల పాటు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు. ఈ విషయంలో తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, జీతంలో కోతలు వేయవద్దని సదరు ఉద్యోగి రికార్డు అసిస్టెంట్ భుక్యా వాలుసింహను ఆశ్రయించాడు.
​ఏసీబీ రంగప్రవేశం: అందుకు ప్రతిఫలంగా వాలుసింహ లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బాధితుడు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
​కోర్టులో హాజరు: నిందితుడిపై కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు.