Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బూరుగుపల్లిలో మూడు మినీ బస్ స్టాప్‌ల నిర్మాణానికి శ్రీకారం

Author TELANGANA ADDA NEWS | 20 Sep 2026, 09:39 AM | advt.
బూరుగుపల్లిలో మూడు మినీ బస్ స్టాప్‌ల నిర్మాణానికి శ్రీకారం

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించిన సర్పంచ్, పాలకవర్గం


1. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందడుగు
2. గ్రామస్తులు, విద్యార్థులకు తప్పనున్న ఎండ, వాన తిప్పలు
3. సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేస్తాం: పాలకవర్గం

బూరుగుపల్లిలో మూడు మినీ బస్ స్టాప్‌ల నిర్మాణానికి శ్రీకారం - Additional Image

తెలంగాణ అడ్డా బోయినిపల్లి ప్రతినిధి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినీపల్లి మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా మూడు చోట్ల మినీ బస్ షెల్టర్ల (బస్ స్టాప్‌ల) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించి, కొలతలు వేసి ముగ్గు పోసి అధికారికంగా భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ పాలకవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ.. గ్రామం మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, విద్యార్థులు, వృద్ధులు బస్సుల కోసం రోడ్డుపై ఎండనక, వాననక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ నిధులతో గ్రామంలోని మూడు ముఖ్య కూడళ్ల వద్ద మినీ బస్ షెల్టర్లను నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
నిర్మాణ పనులను వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వారు స్పష్టం చేశారు. మినీ బస్ స్టాప్‌ల ఏర్పాటుకు చొరవ చూపిన సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు గ్రామ ప్రజలు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్, వార్డు సభ్యులు పేరుక మహేష్ గౌతమి, అక్కరాజు తిరుపతి, వెంకటేష్ వర్షిత, అతికం రాజశేఖర్ గౌడ్, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు యువకులు కరుణాకర్, రజినీకాంత్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి