Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తురక కాశ ముస్లింలకు జనరేటర్ స్కీమ్ అమలు చేయాలి... తురక కాశ సంక్షేమ సంఘం డిమాండ్

Author TELANGANA ADDA NEWS | 20 Sep 2026, 04:30 PM | advt.
తురక కాశ ముస్లింలకు జనరేటర్ స్కీమ్ అమలు చేయాలి...  తురక కాశ సంక్షేమ సంఘం డిమాండ్

తెలంగాణ అడ్డా న్యూస్ /అశ్వాపురం ప్రతినిధి..

తురక కాశ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్. బాద్ షా* గారి ఆదేశాల మేరకు, పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలో తురక కాశ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అశ్వాపురం మండల అధ్యక్షులు షేక్ ఖలీల్ మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలలో తురక కాశలు ఒక ప్రత్యేక వృత్తి సమాజంగా ఉన్నారని, తురక కాశ కార్మికుల జీవనోపాధికి ఉపయోగపడే రాళ్లు కట్ చేసే మిషన్ జనరేటర్ స్కీమ్ను ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ పథకం సాధారణంగా అన్ని ముస్లిం మైనారిటీలకు కాకుండా, తురక కాశ ముస్లింలకు మాత్రమే వర్తించే విధంగా అమలు చేయాలని ఆయన కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల్లో తురక కాశ ముస్లింలు ఉండరని, ఏ మండలాల్లో తురక కాశ ముస్లింలు ఉన్నారో ఆయా ప్రాంతాల్లోని అర్హులైన తురక కాశ కార్మికులకు మాత్రమే ప్రభుత్వం ఈ పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే మంజూరైన జనరేటర్లు, రాళ్లు కట్ చేసే మిషన్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అర్హులైన తురక కాశ ముస్లిం కార్మికులకు అందించాలని జిల్లా కలెక్టర్, మైనారిటీ వెల్ఫేర్ అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ మదార్ వలితో పాటు తురక కాశ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.