Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడి.. రూ. 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి

Author | 22 Sep 2026, 12:47 AM | TELANGANA
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడి.. రూ. 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి

నిజామాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో రూ. 15,000 లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. మున్సిపల్ కార్యాలయంలోని రెండో అంతస్తులోగల ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్ ఈ అవినీతికి పాల్పడ్డారు.
సంఘటన వివరాలు:
నిజామాబాద్ టౌన్‌లోని రాధా రాజేంద్ర చౌరస్తా సమీపంలోని సీతారాం నగర్ కాలనీకి చెందిన పద్మశాలి సంఘం వద్ద నెలవారీ పెన్షన్ మంజూరు కోసం, అలాగే ఫిర్యాదుదారు తల్లి సర్వీస్ గ్రూపులో ఇంక్రిమెంట్ ప్రాసెసింగ్ తయారు చేసి అవసరమైన ఎంట్రీలు మరియు ఇతర వివరాలను నమోదు చేసే అధికారిక సహాయం అందించేందుకు జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్ బాధితుడిని రూ. 15,000 లంచం డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతో పాటు అదే విభాగంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కిరణ్ కుమార్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ద్వారా పూర్తి వివరాలను రికార్డు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమంగా రూ. 15,000 లంచం రూపంలో అక్రమ ప్రయోజనాన్ని స్వీకరించి, ప్రభుత్వ విధులను నిజాయితీ లేకుండా అనుచితంగా నిర్వహించినందుకు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో విచారణ నిమిత్తం గౌరవనీయులైన రెండవ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి గారి ఎదురుగా హాజరుపరచడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.