Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మృతి మానవ తప్పిదమే.. బాధితులను పరామర్శించకుండా మంత్రి ఫోటోలకు పోజులిచ్చారు: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

Author | 22 Sep 2026, 06:05 PM | TELANGANA
ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మృతి మానవ తప్పిదమే.. బాధితులను పరామర్శించకుండా మంత్రి ఫోటోలకు పోజులిచ్చారు: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ ఇంక్యుబేటర్‌లో ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం పూర్తిగా మానవ తప్పిదమేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం నుంచి కనీస సాయం అందకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
మానవ తప్పిదమే కారణం: ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్ లో ప్రమాదం జరిగితే తల్లిదండ్రులే తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేసినా, దురదృష్టవశాత్తు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు.
మంత్రి తీరుపై ఆగ్రహం: బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి కనీస మానవత్వం ప్రదర్శించకుండా కేవలం ఫోటోలు దిగేందుకే వెళ్లారని విమర్శించారు. టూరిజం స్పాట్‌కు వెళ్లినట్లు అర్ధగంట మాత్రమే అక్కడ గడిపి, ఎలాంటి రివ్యూ నిర్వహించకుండా, బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.
అంత్యక్రియలకూ సాయం లేదు: చనిపోయిన పిల్లల్లో ఇద్దరు మైనార్టీలు, ఒక ఆదివాసీ బాబు ఉన్నారని, కనీసం అంత్యక్రియలు నిర్వహించుకోలేని పేదరికంలో ఉన్నా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వస్తున్నారనే ఉద్దేశంతో అంత్యక్రియలను కూడా ఆపడం అత్యంత అమానుషమన్నారు.
పార్టీ తరఫున ఆర్థిక సాయం: బాధితుల దీనస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రక్షణ సేన తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 50 వేలు అందజేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ఆడిట్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి వెంటనే ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో సీలింగ్ కూలడం, అనేక ఆసుపత్రులలో పరికరాలు సరిగా లేకపోవడంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలన్నారు.
ఈ ఘటనను తమ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోందని, రేపు (బుధవారం) స్వయంగా ఆదిలాబాద్ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి వారి బాధల్లో భాగస్వామ్యం అవుతామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.