Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రామగుండం కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా

Author | 22 Sep 2026, 06:32 PM | TELANGANA
రామగుండం కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా

రామగుండం బ్యూరో / తెలంగాణ అడ్డా:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
భద్రతా సిబ్బంది వివరాలు:
పెద్దపల్లి జోన్: ఏసీపీలు-04, సీఐ/ఆర్ఐలు-15, ఎస్ఐ/ఆర్ఎస్ఐలు-25, ఏఎస్సై/హెడ్ కానిస్టేబుళ్లు-26, పోలీస్ కానిస్టేబుళ్లు-81, మహిళా కానిస్టేబుళ్లు-14, హోంగార్డ్స్-30, ఏఆర్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది-25 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జోన్: ఏసీపీలు-03, సీఐ/ఆర్ఐలు-11, ఎస్ఐ/ఆర్ఎస్ఐలు-26, ఏఎస్సై/హెడ్ కానిస్టేబుళ్లు-67, పోలీస్ కానిస్టేబుళ్లు-90, మహిళా కానిస్టేబుళ్లు-17, హోంగార్డ్స్-30, స్పెషల్ పార్టీ సిబ్బంది-10 మంది విధుల్లో ఉంటారు.
కమిషనరేట్ వ్యాప్తంగా: మొత్తం సుమారు 500 మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎస్‌అండ్‌పీసీ సిబ్బందిని బందోబస్తు కోసం కేటాయించారు.
నిమజ్జన విగ్రహాలు మరియు కేంద్రాలు:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,189 వినాయక విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. ఇందులో పెద్దపల్లి జోన్ పరిధిలో 2,659, మంచిర్యాల జోన్ పరిధిలో 2,530 విగ్రహాలు ఉన్నాయి.
పెద్దపల్లి జోన్ పరిధిలో గోదావరి బ్రిడ్జి, గోలివాడ, మంథని గోదావరి ప్రాంతాలు, పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు, మినీ ట్యాంక్ బండ్, సుల్తానాబాద్ చెరువు, హుస్సేన్‌మియా వాగు, మానేరు వాగు తదితర ప్రాంతాల్లో మొత్తం 36 నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జోన్ పరిధిలో గోదావరి బ్రిడ్జి, గూడెం బ్రిడ్జి, గోదావరి పుష్కర ఘాట్,లక్షెట్టిపేట, గౌతమేశ్వర టెంపుల్, మంచిర్యాల, ఇంటెక్ వెల్, సీతారాంపల్లి, గోదావరి ప్రవాహ ప్రాంతాలు, బెల్లంపల్లి పోచమ్మ చెరువు, చెన్నూరు పెద్దచెరువు, సాలిగాం ప్రాజెక్టు, సల్పాల వాగు తదితర ప్రాంతాల్లో 41 నిమజ్జన ప్రదేశాలను సిద్ధం చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు మరియు నిబంధనలు:
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తుతో పాటు పికెట్లు ఏర్పాటు చేశారు. ఇతర శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు, ఫ్లడ్ లైట్లు, క్రేన్లు, ప్లాట్‌ఫారాలు, మంచినీటి వసతి కల్పించడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
అన్ని నిమజ్జన ప్రాంతాలను సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు.
ఉత్సవ కమిటీలు వీలైనంత త్వరగా పూజా కార్యక్రమాలు ముగించి, వెలుతురు ఉన్న సమయంలోనే విగ్రహాలను నిమజ్జన ప్రాంతాలకు తరలించాలని సీపీ సూచించారు. శోభాయాత్రలో వాహనాలపై ప్రయాణించే చిన్నారులు, మహిళల భద్రత పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా డీజేలు వినియోగించడం, బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ వేడుకలను ప్రశాంతంగా ముగించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.