Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలి సీఎం ఎ. రేవంత్ రెడ్డి

Author | 22 Sep 2026, 08:10 PM | TELANGANA
దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలి సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.
​డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం (SC/ST (Prevention of Atrocities) Act, 1989) అమలుపై ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 ఫిబ్రవరి 11న నాటి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
​సమావేశంలోని ముఖ్యాంశాలు:
​హాజరైన ప్రముఖులు: ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు తదితరులు పాల్గొన్నారు.
​కేసులు - సమీక్ష: రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, బాధితులకు అందుతున్న సహాయ పునరావాసంపై సుదీర్ఘంగా చర్చించారు. గడిచిన ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని అధికారులు వివరించారు. అయితే కొన్ని జిల్లాల్లోని 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో, అక్కడ పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా జరగాలని సీఎం ఆదేశించారు.
​గ్రీన్ ఛానెల్ ద్వారా నష్టపరిహారం: అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని, బాధితులకు సకాలంలో నష్టపరిహారం, సహాయం అందేలా చూడాలని చెప్పారు. బాధితులను ఆదుకోవడంలో బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్‌లో నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ప్రత్యేకంగా ప్రస్తావించి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని స్పష్టం చేశారు.
​సంక్షేమం - ఇందిరమ్మ స్ఫూర్తి: ఇందిరా గాంధీ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 16 శాతం ఉంటే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో 31 శాతం, ఎస్టీ జనాభా 10 శాతం ఉంటే 17 శాతం ఇండ్లను మంజూరు చేశామని వివరించారు. అలాగే 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని, 3.48 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
​చదువుకు పెద్దపీట: అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్యలు పరిష్కారం కావని, పిల్లలను చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని సీఎం పిలుపునిచ్చారు.