Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కొదురుపాక బ్రిడ్జి సమీపంలో ప్రమాదకర గుంతలుతక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్

Author TELANGANA ADDA NEWS | 25 Sep 2026, 12:17 PM | TELANGANA
కొదురుపాక బ్రిడ్జి సమీపంలో ప్రమాదకర గుంతలుతక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్

కొదురుపాక బ్రిడ్జి సమీపంలో ప్రమాదకర గుంతలు

అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ సీపీఎం మండల కమిటీ నిరసన

తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్

ఇవి కూడా చదవండి

తెలంగాణ అడ్డా, బోయినపల్లి:
బోయినపల్లి మండల కేంద్రం నుంచి కొదురుపాకకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని సీపీఎం మండల పార్టీ ఆరోపించింది. రహదారి దుస్థితిపై అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మండల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

రోడ్డుపై గుంతల కారణంగా వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొందని సీపీఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు రహదారి పరిస్థితిని పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజలకు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించిన ఆయన, రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో జాప్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే కూడా ఈ సమస్యపై తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు.