Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు ప్రదానం కేరళ రాష్ట్రంలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

Author | 25 Sep 2026, 09:40 PM |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు ప్రదానం   కేరళ రాష్ట్రంలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కేరళ బ్యూరో / తెలంగాణ అడ్డా:
ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డును అందుకున్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎంపీ శ్రీ కేసీ వేణుగోపాల్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
కేరళ వెలుపల నుంచి ఎంపికైన తొలి వ్యక్తి: ఆర్యదాన్ ముహమ్మద్ గారి జ్ఞాపకార్థం ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు కేరళ రాష్ట్రం వెలుపల నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి నిలవడం విశేషం. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలు మరియు ఆయన విశేష నాయకత్వ ప్రతిభను పరిగణనలోకి తీసుకుని జ్యూరీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
కేరళంతో ఉన్న ఆత్మీయ అనుబంధం: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేరళ గడ్డ తనకు ఎంతో ఆత్మీయమైనదని, రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయాన ఇక్కడకు వచ్చిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. లౌకికవాదానికి కట్టుబడి ఉన్న కేరళ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్యదాన్ ముహమ్మద్ సేవలు: కేరళ రాజకీయాల్లో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఆర్యదాన్ ముహమ్మద్ ఒక చాణక్యుడిలా, కాంగ్రెస్ పార్టీకి మహావృక్షంలా నిలిచారని కొనియాడారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం కోసం ఆయన చేసిన పోరాటాన్ని అందరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ చైర్మన్ ఆర్యదాన్ షౌకత్, కేరళ మంత్రులు మరియు పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.