Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రభుత్వ బీమా పథకాలతోనే పేద కుటుంబాలకు భరోసా: టీజీబీ మేనేజర్ సంతోష్

Author TELANGANA ADDA NEWS | 26 Sep 2026, 07:37 AM | advt.
ప్రభుత్వ బీమా పథకాలతోనే పేద కుటుంబాలకు భరోసా: టీజీబీ మేనేజర్ సంతోష్

ప్రభుత్వ బీమా పథకాలతోనే పేద కుటుంబాలకు భరోసా: టీజీబీ మేనేజర్ సంతోష్

భూక్యా తండా వాసి కుటుంబానికి ₹2 లక్షల ప్రమాద బీమా క్లెయిమ్ మంజూరు

తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనం.. ప్రతి ఒక్కరూ బీమా పథకాల్లో చేరాలి:

ఇవి కూడా చదవండి

లబ్ధిదారునికి ₹2 లక్షల బీమా క్లెయిమ్ చెక్కు అందజేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్

సిరిసిల్ల (తెలంగాణ అడ్డా -వీర్నపల్లి ప్రతినిధి):
ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వ బీమా పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) వీర్నపల్లి శాఖ మేనేజర్ సంతోష్ పేర్కొన్నారు. వీర్నపల్లి మండల పరిధిలోని భూక్యా తండా గ్రామానికి చెందిన దివంగత ఖాతాదారుడు గూగులోత్ లింగం నామినీ అయిన ఆయన సతీమణి గూగులోత్ లావణ్యకు మంజూరైన రూ. 2 లక్షల బీమా క్లెయిమ్ చెక్కును సోమవారం బ్యాంక్ అధికారులు అందజేశారు. 
వివరాల్లోకి వెళ్తే.. భూక్యా తండాకు చెందిన బ్యాంక్ ఖాతాదారుడు గూగులోత్ లింగం ఇటీవల దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన గతంలో తన బ్యాంక్ ఖాతా ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) / జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకానికి నామమాత్రపు ప్రీమియం చెల్లించి సభ్యునిగా చేరారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యురాలు గూగులోత్ లావణ్య బీమా పరిహారం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోగా, బ్యాంక్ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత పత్రాలను వేగంగా పరిశీలించి రూ. 2,00,000/- క్లెయిమ్ మొత్తాన్ని మంజూరు చేయించారు. 
ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సంతోష్ నామినీ గూగులోత్ లావణ్యకు చెక్కును అందజేసి మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గ్రామీణ ప్రజల ఆర్థిక ప్రగతితో పాటు వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉండటమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ వార్షిక ప్రీమియంతో అందిస్తున్న పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై పథకాల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఊహించని విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తాయని వివరించారు. కష్టకాలంలో తమ దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించి క్లెయిమ్ అందించినందుకు మృతుడి కుటుంబ సభ్యులు బ్యాంక్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, క్యాషియర్ అరుణ్, అటెండర్ షకీల్ తదితరులు పాల్గొన్నారు.