Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ స్పందిస్తారా? నిబంధనలకు విరుద్ధంగా, ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘించి ఫ్లెక్సీలు కట్టిన వారిపై జరిమానాలు విధిస్తారా లేక తొలగిస్తారా? అధికారుల చర్యలపై వేచి చూస్తున్న ప్రజలు!

Author | 29 Sep 2026, 01:25 PM | Politics, TELANGANA
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ స్పందిస్తారా? నిబంధనలకు విరుద్ధంగా, ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘించి ఫ్లెక్సీలు కట్టిన వారిపై జరిమానాలు విధిస్తారా లేక తొలగిస్తారా? అధికారుల చర్యలపై వేచి చూస్తున్న ప్రజలు!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణం ప్రారంభోత్సవం తదితర అధికారిక కార్యక్రమాల పేరుతో నగరంలో నిబంధనలను గాలికొదిలి ఇష్టారాజ్యంగా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా రోడ్లకు అడ్డంగా, ప్రధాన కూడళ్లలో భారీ సైజుల్లో ఫ్లెక్సీలు కట్టడం వల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాజన్న సిరిసిల్లలోనూ అదే పరిస్థితి..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పేరుతోనూ సరిగ్గా ఇదే తరహాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కరీంనగర్ మరియు సిరిసిల్ల ప్రాంతాల్లో అనధికారికంగా వెలుస్తున్న ఈ ఫ్లెక్సీలపై నగరపాలక సంస్థ, మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే జరిమానాలు విధిస్తారా? లేక ప్రమాదకరంగా ఉన్న ఆ ఫ్లెక్సీలను తొలగిస్తారా? అధికారిక నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పర్యావరణాన్ని విస్మరిస్తూ ప్లాస్టిక్ ఫ్లెక్సీల హోరు:
ఒకవైపు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిరోధించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం నిత్యం ప్రచారం చేస్తోంది. సామాన్య ప్రజలు చిన్న చిన్న బోర్డులు లేదా ప్లాస్టిక్ వస్తువులు వాడితే భారీగా జరిమానాలు విధించే అధికార యంత్రాంగం.. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో అధికారులే స్వయంగా భారీ ప్లాస్టిక్ ఫ్లెక్సీలను అడ్డగోలుగా ఏర్పాటు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా పర్యావరణ నిబంధనలను, ప్లాస్టిక్ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్లవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు లేని హోర్డింగులతో ప్రమాదాలు:
నిబంధనల ప్రకారం మున్సిపల్ అనుమతులు లేకుండా ఎలాంటి ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. కానీ రాజకీయ జోక్యంతో నిబంధనలను తుంగలో తొక్కి ఏర్పాటు చేసిన ఈ భారీ ఫ్లెక్సీల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి.. అధికారుల నిర్లక్ష్యం:
అనుమతులు లేని ఫ్లెక్సీల వల్ల స్థానిక సంస్థలకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. మున్సిపల్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికారుల స్పందన కోసం వేచి చూస్తున్న ప్రజలు:
ప్రభుత్వ నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేయాలని, ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ అడ్డగోలుగా కట్టిన వారిపై కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిందే!