Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చాకలివానిపల్లి సర్పంచ్ రేపాక బాణవ్వ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సర్పంచ్.

Author | 29 Sep 2026, 04:53 PM | Politics, TELANGANA
చాకలివానిపల్లి సర్పంచ్ రేపాక బాణవ్వ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సర్పంచ్.

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామ సర్పంచ్ రేపాక బాణవ్వ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆమెను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతిని, సంక్షేమాన్ని ధ్యేయంగా చేసుకొని ముందుకు వెళ్తోందని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలంటే ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో సైనికుల లాగా పని చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలోకి చేరిన సర్పంచ్ రేపాక బాణవ్వను ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే, భవిష్యత్తులో గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునిల్, గన్నేరువరం పట్టణ పార్టీ అధ్యక్షుడు సీహెచ్ శ్రీధర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కట్కం తిరుపతి, మాజీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్ రావు, కేడీసీసీ డైరెక్టర్ అలువాల కోటి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, పార్టీ నాయకులు నక్క మహేందర్, రాపోలు నవీన్, కె. రాజయ్య, రాపాక బాబు, విజేందర్, మ్యాదరి శ్రీను, ఉదయ్ రెడ్డి, డి. అనిల్ తదితరులు పాల్గొన్నారు.