Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ

Author | 30 Sep 2026, 01:44 AM | Politics, TELANGANA
కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆమోదిస్తూ ప్రకటన విడుదల చేశారు.
మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ స్థానం: ఈ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా బరిలో నిలపనుంది.
నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానం: ఈ నియోజకవర్గం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ పరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ప్రచారానికి సమాయత్తమవుతోంది.