Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రజాపాలన కాదు ఇది పూర్తిగా ప్రతీకార పాలన: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నేత కొంకటి శేఖర్ తీవ్ర ఆగ్రహం

Author | 30 Sep 2026, 09:56 AM | TELANGANA
ప్రజాపాలన కాదు ఇది పూర్తిగా ప్రతీకార పాలన: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నేత కొంకటి శేఖర్ తీవ్ర ఆగ్రహం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కార్యక్రమం ఉన్నందున, పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోయినపల్లి మండల బీఆర్ఎస్ నాయకులను తెల్లవారుజామున 4 గంటలకే ముందస్తుగా అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ నేత కొంకటి శేఖర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో హిట్లర్ పాలనను మించిన ప్రతీకార పాలన సాగుతోందని విమర్శించారు.
ప్రివెంటివ్ అరెస్టులతో భయానక వాతావరణం:
ప్రతిపక్ష పార్టీల నాయకులను, ప్రజాస్వామ్య వాదులను ఎక్కడ నిలదీస్తారనే భయంతోనే పోలీసులు ముందస్తు (ప్రివెంటివ్) అరెస్టులకు పాల్పడుతున్నారని కొంకటి శేఖర్ ఆరోపించారు. ఇలాంటి భయస్తుడైన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల సిగ్గుచేటు అని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని పోలీసు బలంతో బోయినపల్లి మండల బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ధ్వజమెత్తారు.
హామీలు గాలికి.. ప్రజాధనం దుర్వినియోగం:
ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రజాధనాన్ని వృథా చేస్తూ సభలు నిర్వహిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని, ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ మరింత ముందుకు వెళ్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.
అరెస్ట్ అయిన ప్రధాన నాయకులు:
ఈరోజు వివిధ గ్రామాల నుంచి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులలో కొంకటి శేఖర్, దేశాయిపల్లి సర్పంచ్ నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, మన్వాడ సర్పంచ్ కట్ట గోవర్ధన్, మల్లరపు చందు, దూస మధు, వర్ధవెళ్లి మాజీ సర్పంచ్ రాజు, తిరుపతి, తోట మధుకర్, నాగుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మోతె ఎల్లారెడ్డి, గురిజాల కోటి, కొనుకటి చంద్రయ్య తదితరులు ఉన్నారు.