Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నేరెళ్ల బాధితులు అసలు బాధితులే కాదంటారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

Author | 04 Oct 2026, 09:24 AM | Politics, TELANGANA
నేరెళ్ల బాధితులు అసలు బాధితులే కాదంటారా?  రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
నేరెళ్ల బాధితులను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు బాధితులకు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేసిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేరెళ్ల బాధితులు అసలు బాధితులు అని చెప్పడానికి ఆధారాలే లేవని ప్రభుత్వం చెబుతున్న తీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ధ్వజమెత్తారు.
హామీలు ఏమైపోయాయి?:
అధికారంలోకి వస్తే నేరెళ్ల బాధితులకు అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, నేడు అధికారంలోకి రాగానే మాట మార్చడం దారుణమని విమర్శించారు. ఆనాడు పోలీసుల అణచివేతకు గురై సర్వస్వం కోల్పోయి ఆగమైన బాధితుల జీవితాలకు నేడు కేవలం మొక్కుబడి సాయంతో సరిపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రధాన ప్రశ్నలు:
బాధిత కుటుంబాలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఆ హామీ ఏమైంది?
ఆనాడు ఆ దారుణ ఘటనకు కారణమైన అధికారులపై మరియు దోషులపై ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి?
ఈ ఘటనపై ఇంతవరకు జరిపిన విచారణకు సంబంధించిన ఎంక్వైరీ రిపోర్ట్ ఎక్కడ ఉంది? దానిని ఎందుకు బయటపెట్టడం లేదు?
నేరెళ్ల ఘటనపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. బాధితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని వీడి, ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.