Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సిరిసిల్ల రైల్వే లైన్ సాధన కోసం ఉధృత పోరాటం చేస్తాం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

Author | 06 Oct 2026, 07:23 PM | TELANGANA
సిరిసిల్ల రైల్వే లైన్ సాధన కోసం ఉధృత పోరాటం చేస్తాం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
సిరిసిల్ల మరియు సిద్ధిపేట నుంచి జనగాం వరకు రైల్వే లైన్ సాధించాలన్నది ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అని, అయితే దీని గురించి మాట్లాడే దిక్కు బలమైన ప్రజాప్రతినిధులు కరవయ్యారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన నాయకులు మౌనం వహించడాన్ని ఆమె తప్పుబట్టారు.
ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే లైన్ సాధన కోసం తమ పార్టీ తరఫున కచ్చితంగా తీవ్రంగా ప్రయత్నిస్తామని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో నేషనల్ హైవే పనులు కూడా ఎక్కడికక్కడ పెండింగ్‌లో పడిపోవడం వల్ల రవాణా సౌకర్యం లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలకుల నిర్లక్ష్య ధోరణిపై తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాటం సాగిస్తుందని కవిత తేల్చిచెప్పారు.