Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఈనెల 17న పద్మనగర్‌లో టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల ప్రారంభం స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్

Author | 11 Oct 2026, 06:40 PM | Politics, TELANGANA
ఈనెల 17న పద్మనగర్‌లో టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల ప్రారంభం స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
కరీంనగర్ నగరంలోని పద్మనగర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులు ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీటీడీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పద్మనగర్‌లోని శ్రీవారి ఆలయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు, సాంకేతిక అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
కేసీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ప్రాజెక్ట్:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో, 2023 మే 31న తమ చేతుల మీదుగా పద్మనగర్‌లో టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిందని గుర్తుచేశారు. ఆలయ నిర్మాణ ప్రక్రియ ఈ నెల 17న అధికారికంగా ప్రారంభం కానుండటం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు.
కరీంనగర్‌లో ఆధ్యాత్మిక శోభ:
శ్రీవారి దివ్య ఆశీస్సులతో పద్మనగర్‌లో అత్యంత వైభవంగా దేవాలయం రూపుదిద్దుకుని ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా మరియు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ స్వయంగా స్వామివారిని దర్శించుకుని సేవ చేసుకునే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఈనెల 17న పద్మనగర్‌లో టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల ప్రారంభం స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ - Additional Image