Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జీవో 1181ను రద్దు చేయాలి అక్టోబర్ 15న సీడీఎంఏ కార్యాలయం ఎదుట ధర్నా!

Author | 12 Oct 2026, 04:15 PM | TELANGANA
జీవో 1181ను రద్దు చేయాలి అక్టోబర్ 15న సీడీఎంఏ కార్యాలయం ఎదుట ధర్నా!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం

​ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

​జేఏసీ డిమాండ్ల పరిష్కారానికి వీడని పట్టు.. సమ్మె దిశగా ఉద్యోగుల ప్రయాణం

ఇవి కూడా చదవండి

​కరీంనగర్ / వరంగల్ (తెలంగాణ అడ్డ)

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ మరియు ఇతర ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ సమర శంఖం పూరించింది. మున్సిపల్ ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న జీవో నంబర్ 1181ను తక్షణమే రద్దు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న (గురువారం) హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు.ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులకు ముందస్తు సమ్మె/ధర్నా నోటీసు లేఖను సమర్పించారు.

​ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే

​జీవో 1181 రద్దు: మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసే జీవో నంబర్ 1181ను పూర్తిగా రద్దు చేయాలి.
​ప్రత్యేక కార్పొరేషన్: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దళారీ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి.
​నేరుగా వేతనాలు: ఉద్యోగుల వేతనాలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధానాన్ని తీసుకురావాలి. సమాన పనికి సమాన వేతనం: సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తూ, నిలిచిపోయిన పెండింగ్ వేతనాలు, బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు

అర్హులైన ప్రతి ఒక్క ఉద్యోగికి ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ తదితర చట్టబద్ధమైన ప్రయోజనాలు కల్పించాలి.

​ఆర్థిక సాయం & భద్రత: విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే దహన సంస్కారాల నిమిత్తం రూ. 20,000 ఆర్థిక సాయం తక్షణమే అందించాలి.

​హక్కుల రక్షణ: ఉద్యోగ, ఆరోగ్య భద్రతతో పాటు కనీస వేతనాలు, యూనిఫారాలు, సేఫ్టీ కిట్లు, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి.