Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జ్యోతిష్మతి చైర్మన్ సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

Author | 12 Oct 2026, 08:55 PM | TELANGANA
జ్యోతిష్మతి చైర్మన్ సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

కరీంనగర్ బ్యూరో , తెలంగాణ అడ్డ

నుస్తులాపూర్ లో రూ. 100 కోట్ల దళితుల అసైన్డ్ భూమి కబ్జా?

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఏఐఎఫ్‌బీ ఫిర్యాదు

రేపు ఉదయం 11 గంటలకు చర్చలకు ఆహ్వానించిన కలెక్టర్

కరీంనగర్ (తెలంగాణ అడ్డ):

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 574 పరిధిలో గల సుమారు 15 ఎకరాల 09 గుంటల దళితుల అసైన్డ్ భూమిని జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జె. సాగర్ రావు ఆక్రమించుకున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) జిల్లా నాయకులు ఆరోపించారు. సుమారు రూ. 100 కోట్ల విలువైన ఈ భూమిని కాపాడి, అసలైన ఎస్సీ లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, మంగళవారం (రేపు) ఉదయం 11 గంటలకు పూర్తి వివరాలతో చర్చలకు రావాల్సిందిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్‌ను కోరారు.

ఇవి కూడా చదవండి

ఫిర్యాదులోని ప్రధాన ముఖ్యాంశాలు:

క్రమబద్ధీకరణ దరఖాస్తు రద్దు చేయాలి: షాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జ్యోతిష్మతి విద్యాసంస్థలు) పేరుతో సర్వే నంబర్ 574 లో జి.ఓ.ఎం.ఎస్. నంబర్ 59 కింద సమర్పించిన క్రమబద్ధీకరణ (Regularisation) దరఖాస్తును మరియు డీడీ (నెంబరు: 5129) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి.

భూమి స్వాధీనం హామీ అమలు చేయాలి:

గతంలో తిమ్మాపూర్ తహసీల్దార్ తన ప్రొసీడింగ్స్ (నం. B/293/1/2007, తేదీ: 21-07-2007) ద్వారా ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
చట్టవిరుద్ధ నిర్మాణాల తొలగింపు: భూముల ఆక్రమణ నిషేధ చట్టం 1977 (A.P. Prohibition of Assignment Lands Act, 1977) మరియు రిజిస్ట్రేషన్ చట్టాలను ఉల్లంఘించి చేపట్టిన అనాధికార నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలి.
అధికారులపై చర్యలు: 20 ఏళ్లుగా ఆక్రమణదారులకు సహకరిస్తూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

పేదల హక్కుల కోసం పోరాటం ఆగేది లేదు:

ఈ సందర్భంగా ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ.. "అతిపెద్ద భూస్వామి, వేల కోట్ల ధనవంతుడు అనే అధికార బలంతో సాగుతున్న ఈ అక్రమాలను అడ్డుకోవడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. దళితుల, పేదల హక్కులను కాలరాసే ఇటువంటి అక్రమాలను సహించేది లేదు. ఆక్రమణల నుంచి భూమిని విడిపించి, అసలైన ఎస్సీ లబ్ధిదారులకు తిరిగి కేటాయించే వరకు మా పోరాటం కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.
ఈ ఫిర్యాదు సమర్పించిన వారిలో ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ బోట్ల శ్యామల-తంగెళ్ల కిరణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు బద్రినేత, నాయకులు ప్రవీణ్, బన్నీ తదితరులు ఉన్నారు.