Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

Author | 12 Oct 2026, 11:39 PM | Array
రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

కరీంనగర్ బ్యూరో తెలంగాణ అడ్డా

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో కలకలం

​ హెచ్‌ఎండీఏ లేఅవుట్ క్లియరెన్స్ కోసం భారీ డిమాండ్

ఇవి కూడా చదవండి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో భారీ అవినీతి బట్టబయలైంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఓ లేఅవుట్ క్లియరెన్స్‌కు సంబంధించి బాధితుల నుంచి రూ. 30 లక్షలు లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్ శ్రీనివాసులు, తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
​రూ. 20 లక్షలకు కుదిరిన డీల్..
​బాధితుల భూమికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడానికి ఇద్దరు అధికారులు కలిసి మొదట రూ. 30 లక్షలు డిమాండ్ చేయగా, చివరికి రూ. 20 లక్షలకు డీల్ కుదిరింది. ఈ వ్యవహారంపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పక్కా సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో అబ్దుల్లాపూర్‌మెట్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. సర్వేయర్ శ్రీనివాసులు లంచం సొమ్ము తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
​ఏకకాలంలో సోదాలు.. కొనసాగుతున్న విచారణ
​ఈ దాడి అనంతరం ఏసీబీ బృందాలు తహసీల్దార్, సర్వేయర్ల ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. అక్రమాస్తులకు సంబంధించి కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అవినీతి అధికారుల బరస్ట్ పట్ల ప్రజలు మరియు నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.