Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అభివృద్ధిలో అక్రమాలు వెలికితీస్తే అక్రమ కేసులా

Author | 13 Oct 2026, 08:43 AM | Array
అభివృద్ధిలో అక్రమాలు  వెలికితీస్తే అక్రమ కేసులా

జవాబుదారీతనంగా ఉండాల్సిన మాజీ సుడా చైర్మన్ కక్షసాధింపు చర్యలు ఎంతవరకు సమంజసం

మరమ్మత్తులు చేశారంటే వార్తలోని వాస్తవికత రుజువైనట్టే కదా

అభివృద్ధిలో అక్రమాలు  వెలికితీస్తే అక్రమ కేసులా - Additional Image

సుడా నిధులతో పనులు మాజీ చైర్మన్. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హయాంలోనే జరిగాయి కదా

జర్నలిస్టులపై బిఎన్ఎస్ సెక్షన్లు 352, 353(2) మోపడం అక్రమం.. న్యాయ నిపుణుల స్పష్టీకరణ

ఆర్టికల్ 19(1)(a) ప్రకారంప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం జర్నలిస్టులపై చర్యలు అప్రజాస్వామికం జర్నలిస్టులకు సమాచార మూలాలను గోప్యంగా ఉంచే హక్కు ఉంది

కరీంనగర్ నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద జరిగిన సుందరీకరణ పనులలో నాణ్యతా లోపాలను ఎత్తిచూపుతూ విజిలెన్స్ అధికారుల విచారణకు డిమాండ్. తెలంగాణ అడ్డా మీడియాలో ప్రచురితమైన కథనంపై తలెత్తిన పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మీడియాలో వార్త వచ్చిన తరువాత అధికార యంత్రాంగం స్పందించి, ఊడిపోయిన పైపులను బిగించి యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో లోపాలు ఉన్నాయని మీడియాలో వార్త రాసినందువల్లే అధికారులు వాటిని బాగుచేసారు.అంటే క్షేత్రస్థాయిలో సమస్య ఉందని, మీడియా రాసింది అక్షరాలా నిజమని అధికారులు పనులు చేయడమే ప్రత్యక్ష నిదర్శనం. వార్త రాసిన జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు దిగడం హేతుబద్ధంకాదు.మరమ్మత్తులు చేశారంటే వార్తలోని వాస్తవికత రుజువైనట్టే కదా
మరి అలాంటప్పుడు ఆ వార్త తప్పు ఎలా అవుతుంది?జర్నలిజంలో ప్రాథమిక సూత్రం సత్యం మరియు ప్రజానీకానికి మేలు చేయడం రాజీవ్ చౌక్ వద్ద పైపులు ఊడిపోయి నాణ్యతా ప్రమాణాలు గాల్లో కలిసిపోయిన వైనాన్ని 'తెలంగాణ అడ్డా ' ఛాయాచిత్రాలతో సహా నిరూపించింది.

ఈ సెక్షన్లు జర్నలిస్టులపై వర్తిస్తాయా?

వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులపై బిఎన్ఎస్ సెక్షన్లు 352, 353(2) కింద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం?
ఈ చట్టాలు జర్నలిస్టులపై ఏ విధంగా వర్తిస్తాయి అనే దానిపై న్యాయ నిపుణులు ఇస్తున్న విశ్లేషణ ఇక్కడ పరిశీలించవచ్చు పోలీసులు నమోదు చేసిన బిఎన్ఎస్ సెక్షన్లు 352 (శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం) మరియు 353(2) (ప్రజా విద్రోహ చర్యలు లేదా తప్పుడు వదంతులు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టడం) వంటివి జర్నలిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించవు.

తప్పుడు వదంతులు కావు - ఆధారాలతో కూడిన వాస్తవాలు:

ఇవి కేవలం పుకార్లు లేదా వదంతులు కావు. కళ్లకు కనిపిస్తున్న వాస్తవాలను, ఛాయాచిత్రాలతో సహా ప్రచురించిన కథనం. పనులు చేసిన తర్వాత అధికారులు వాటిని బాగుచేయడమే దీనికి తిరుగులేని రుజువు.

ప్రజా ప్రయోజనాలే ధ్యేయం:

ఇవి కూడా చదవండి

ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే సదుద్దేశంతో, పారదర్శకత కోసం ప్రశ్నించడాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. అధికార యంత్రాంగాన్ని లేదా ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కును ఏ చట్టం కూడా ఆపలేదు.

మీడియాలో గోప్యత – సమాచార మూలాల రక్షణ హక్కు:

మీడియా గోప్యతకు రాజ్యాంగం కల్పించే హక్కు విలేకరులకు ఉంది. విలేకరుల దగ్గర ఉన్న రికార్డులు లేదా సమాచారం ఇవ్వమని చెప్పడం మీడియా స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం కలిగించే చర్య. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1)(a) భావప్రకటన స్వేచ్ఛ ప్రకారం.. జర్నలిస్టులకు తమ రహస్య సమాచార మూలాలను (సోర్సెస్) పూర్తిగా కాన్ఫిడెన్షియల్ (గోప్యంగా) ఉంచుకునే సంపూర్ణ హక్కు ఉంది. దర్యాప్తు పేరుతో విలేకరుల రికార్డులను అడగడం లేదా ఒత్తిడి చేయడం చట్టవిరుద్ధం.

రాజీవ్ చౌక్ అభివృద్ధి పనుల నేపథ్యం:

ప్రారంభ అంచనాలు:

అప్పట్లో రాజీవ్ చౌక్ ప్రాంతాన్ని సుందరీకరించడానికి సుమారు రూ. 18 లక్షలతో అభివృద్ధి పనులు చేపడతామని విస్తృతంగా ప్రచారం జరిగింది.

నిధుల కేటాయింపు:

ఆ తర్వాత కొన్ని మార్పులతో విగ్రహ ఏర్పాటు మినహాయించి, మిగతా సుందరీకరణ పనుల కోసం ఏకంగా రూ. 15 లక్షలు కేటాయించినట్లు, ఆ పనులన్నీ అప్పట్లో అధికారికంగా పూర్తయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఎవరి హయాంలో జరిగాయి? అప్పట్లో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హయాంలోనే ఈ పనులన్నీ జరిగాయి. ప్రభుత్వ నిధులతో అధికారికంగా పూర్తి చేసిన ఈ పనుల్లో నాణ్యతా లోపాలు బయటపడినప్పుడు, బాధ్యత వహించాల్సిన వారు మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని మీడియా వార్త లేవనెత్తింది ప్రజాధనం ఖర్చుపై పనుల నాణ్యతపై ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన మాజీ సుడా చైర్మన్ బాధ్యతాయుతంగా స్పందించాల్సింది పోయి, తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా మీడియాపై ఎదురుదాడికి దిగడం విస్మయానికి గురిచేస్తోంది.

బెదిరింపులకు భయపడేది లేదు

అక్రమ ఎఫ్‌ఐఆర్‌లు, రూ. 25 లక్షల పరువునష్టం లీగల్ నోటీసులతో తెలంగాణ అడ్డా గొంతును ఎవరూ నొక్కలేరు ప్రజల పక్షాన నిలబడి నిజాలు నిగ్గుతేల్చే క్రమంలో ఎదురయ్యే ఇలాంటి కుట్రలను చట్టపరంగా న్యాయపోరాటం ద్వారా తిప్పికొట్టేందుకు తెలంగాణ అడ్డా మీడియా సంసిద్ధంగా ఉంది సత్యమే ఆయుధంగా సాగే ఈ ప్రయాణంలో ప్రజా సమస్యలపై పోరాటం తెలంగాణ అడ్డా

ప్రశ్నించిన జర్నలిస్టులపై లీగల్ నోటీసులు, ఎఫ్‌ఐఆర్‌లా?

ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని జరిగిన పనుల్లోని లోపాలను ప్రశ్నిస్తూ వార్త రాస్తే జవాబుదారీతనంగా ఉండాల్సిన మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన అనుచరులతో పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపడం అత్యంత దుర్మార్గం తప్పులను ప్రశ్నించిన కలంపై కక్షసాధింపు చర్యలకు దిగడం ద్వారా ప్రజల గొంతును నొక్కలేరు నిజాలను నిగ్గుతేల్చే ఈ ప్రయాణంలో ఇలాంటి బెదిరింపులను తిప్పికొట్టడం లీగల్ నోటీసులు అక్రమ ఎఫ్‌ఐఆర్‌లకు భయపడకుండా వాస్తవాలను ఎల్లప్పుడూ ప్రజల ముందంచడంలో యాజమాన్యం ఎప్పుడూ జర్నలిస్టుల వెన్నంటే ఉంటుంది. 'తెలంగాణ అడ్డా మీడియా ఎప్పటికీ వెనుకాడదు.