Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం 5, 500 మాత్రమే లాభాల వాటా ప్రకటించడం దారుణం...

Author | 13 Oct 2026, 05:33 PM |
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం 5, 500 మాత్రమే లాభాల వాటా ప్రకటించడం దారుణం...

ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పునరాలోచన చేయాలి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 10% లాభాల వాటా ప్రకటించాలి.

ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ( టి యు సి ఐ)రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

తెలంగాణ అడ్డా న్యూస్,(భద్రాద్రి జిల్లా ప్రతినిధి ).

ఇవి కూడా చదవండి

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కేవలం 5500 రూపాయలు లాభాల వాటా ప్రకటించి చేతులు దులుపు కోవడం దారుణమని, సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం పునరా లోచన చేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మి కులకు 10% లాభాల వాటా ప్రక టించాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ( టి యు సీ ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. మధుసూద న్ రెడ్డి డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా సింగరేణి కాంట్రా క్టు కార్మికులు కూడా పనిచేస్తూ, సంస్థ లాభాలలో భాగస్వా మ్యం అవుతున్న ప్పటికీ, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష చూప టం దారుణం అని అన్నారు. సింగరే ణికి లాభాలు రావడానికి కారణం కాంట్రాక్టు కార్మికులే అన్నారు.ఒక పర్మి నెంట్ కార్మికుడికి ఇచ్చే వేతనం తోటి సుమారు పదిమంది కాంట్రాక్టు కార్మికులను నియమించుకొని వారి శ్రమ దోపిడీ చేయ డం వలనే సింగ రేణి కి లాభాలు వస్తున్నా యి అన్నా రు.సింగరేణి లాభాలకు కారకు లైన కాంట్రాక్టు కార్మికులను విస్మరించ డం దారుణమన్నారు.సింగరేణికి నికర లాభం 1754 కోట్లు వచ్చినట్లు సింగరేణి యాజ మాన్యం,ప్రభుత్వం ప్రకటించి,నికర లాభాలలో పర్మినెంట్ కార్మికులకు 34% అనగా ఒక్కొక్క కార్మికుడికి 1,53, 912 రూపాయలు గా ప్రకటించిందని అన్నా రు.వారికి 34% ప్రకటించడం సంతోషిం చదగ్గ విషయమే అయినప్పటికీ, కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం 5500 రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకోవడం దారు ణం అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పునరాలోచన చేసి లాభాలకు కారకు లైన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు నికర లాభాలలో 10% లాభాల వాటా ప్రకటించాలని సింగరేణి యాజమా న్యాన్ని,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..