Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కరీంనగర్‌లో ‘యూని ప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ నూతన బ్రాంచ్ ప్రారంభం!

Author | 14 Oct 2026, 08:22 PM | TELANGANA
కరీంనగర్‌లో ‘యూని ప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ నూతన బ్రాంచ్ ప్రారంభం!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

విదేశీ విద్యపై విద్యార్థులకు ఉన్నతమైన మార్గదర్శకత్వం అందించడమే లక్ష్యం

కరీంనగర్‌లో ‘యూని ప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ నూతన బ్రాంచ్ ప్రారంభం! - Additional Image

నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించే ప్రముఖ సంస్థ ‘యూని ప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ నూతన శాఖ కరీంనగర్ నగరంలో బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కమాన్ నుండి బస్ స్టాండ్ రోడ్డులోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ భవనం నాల్గవ అంతస్తులో ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ముఖ్య అతిథులుగా మేయర్, డిప్యూటీ మేయర్:

ఇవి కూడా చదవండి

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్‌ను అధికారికంగా ప్రారంభించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శి:

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. కరీంనగర్ మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు అవసరమైన పూర్తి సమాచారం, కోర్సుల ఎంపిక, వీసా ప్రక్రియ మరియు నిపుణుల సలహాలు ఒకే చోట లభించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సంస్థ ద్వారా స్థానిక విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తమ భవిష్యత్తును బంగారు బాటగా మలచుకోవాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

ఈ ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక కార్పొరేటర్లు కొలిపాక రమ్య - శ్రీనివాస్, కర్రె అనిల్, నలువాల పుష్పలత - రవీందర్, సంస్థ ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.