Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దుర్గామాతకు ప్రత్యేక పూజలు

Author Thirupathi Pannala | 17 Oct 2026, 05:41 PM | Bhakti, తెలంగాణ, పెద్దపల్లి
దుర్గామాతకు ప్రత్యేక పూజలు

ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు


వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ.

దుర్గామాతకు ప్రత్యేక పూజలు  - Additional Image


పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 16 తెలంగాణ అడ్డా దుర్గా మాతా దయవల్ల నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అమ్మవారిని వేడుకున్నారు.
మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు సుభాష్ నగర్ లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆరవ వార్డు కౌన్సిలర్ బాకం సాయికిరణ్ యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆరవ వార్డు మహిళలు సమస్యలను ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకువెళ్లగా, పరిష్కారం చేయాలని వార్డు కౌన్సిలర్ సాయి కిరణ్ యాదవ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నేత దుగ్యాల సంతోష్ రావు, రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, ఉట్ల వర ప్రదీప్, తొర్రి కొండ ప్రభాకర్, మాజీ వార్డు సభ్యులు అమిరి శెట్టి తిరుపతి, కాంగ్రెస్ నాయకులు గాదాసు రవీందర్, బిజెపి నేత కందునూరి కుమార్, తోపాటు ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు న్యాతరి శ్యాంసుందర్, మామిడిపల్లి శ్రీకాంత్, న్యాతరి దేవేందర్ కుమార్, ఆరేపల్లి కిరణ్, ఆరెపల్లి హేమన్ రాజు, న్యాతరి దుర్గయ్య, నిర్వాహకులు ఆరేపల్లి రాకేష్ తోపాటు, ఆరవ వార్డు మహిళలు లలిత తదితరులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి