Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఈ నెల 23న రైతాంగ సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి

Author | 17 Oct 2026, 11:56 PM | TELANGANA
ఈ నెల 23న రైతాంగ సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

తిమ్మాపూర్‌లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో దిశానిర్దేశం

భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కరీంనగర్లోని తిమ్మాపూర్ మండలంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23వ తేదీన రైతాంగ సమస్యలపై చేపట్టనున్న కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులను పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల అప్పులన్నీ తీరుస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు.

23న కలెక్టరేట్ ముట్టడి: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు ఈ నెల 23న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండలంలోని 12 శక్తికేంద్రాల ఇంచార్జ్‌లు, కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొని రైతులను, కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరించాలని కోరారు.

సన్నాహక సమావేశాలు: అక్టోబర్ 19 లోపు అన్ని శక్తి కేంద్రాల ఇంచార్జ్‌లు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, అక్టోబర్ 25న శక్తి కేంద్రాల వారీగా టిఫిన్ బైఠకులు నిర్వహించి యువకులను, రైతులను సమాయత్తం చేయాలని సూచించారు.

యువత ప్రదర్శన: నవంబర్ 3న యువతను పెద్ద ఎత్తున సమీకరించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా భారీ యువత ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.పార్టీ శ్రేణులందరూ ఐక్యంగా ఉండి బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో పార్టీని విజయపథంలో నడిపించడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.