Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బూరుగుపల్లిలో పూల సంబురం.. ఘనంగా బతుకమ్మ వేడుకలు విజయ్ నగర్ కాలనీలో ఆటపాటలతో హోరెత్తించిన ఆడపడుచులు

Author Boini venu | 19 Oct 2026, 09:39 AM | Bhakti
బూరుగుపల్లిలో పూల సంబురం.. ఘనంగా బతుకమ్మ వేడుకలు  విజయ్ నగర్ కాలనీలో ఆటపాటలతో హోరెత్తించిన ఆడపడుచులు

రంగురంగుల పూలతో ఒద్దికగా తీర్చిదిద్దిన బతుకమ్మలు

ఆకట్టుకున్న ప్రత్యేక విద్యుద్దీపాల వెలుగులు

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం

ఇవి కూడా చదవండి

బూరుగుపల్లి (తెలంగాణ అడ్డా స్టాఫ్ రిపోర్టర్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు బూరుగుపల్లి గ్రామంలోని విజయ్ నగర్ కాలనీలో అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కాలనీకి చెందిన మహిళలు, యువతులు, చిన్నపిల్లలు సంప్రదాయ పట్టువస్త్రాలు ధరించి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తీరొక్క పూలతో అందంగా, ఆకర్షణీయంగా పేర్చిన బతుకమ్మలను కాలనీ కూడలిలో ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో" అంటూ మహిళలు పాడిన పాటలు, ఆడిన కోలాటాలు కాలనీలో పండుగ శోభను, సందడిని నింపాయి.
ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణ (స్పెషల్ లైటింగ్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలనీ పెద్దలు, గ్రామస్తులు మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం బతుకమ్మలను స్థానిక జలాశయంలో నిమజ్జనం చేసి, మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.