Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే దుష్ప్రచారాలు...

Author | 23 Oct 2026, 08:11 PM |
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే దుష్ప్రచారాలు...

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కురం రవి ముదిరాజ్

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

మణుగూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఉనికి కోల్పోతున్నా మనే భయంతోనే ధర్నాలు, రాస్తారోకోల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కురం రవి ముదిరాజ్ విమర్శించారు,శుక్రవారం మణుగూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని వివిధ వార్డుల్లో పాదయాత్రలు చేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటు న్నారని తెలిపారు.సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు.ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు మణుగూరు మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నారని వెల్ల డించారు.పట్టణం లో మంచినీటి సమస్య కు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సుమారు రూ.17 కోట్ల వ్యయంతో రెండు వాట ర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు కొత్త పైప్‌లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.ఎమ్మెల్యే నేతృత్వం లో పట్టణాన్ని అభివృ ద్ధి పథంలో ముందు కు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు

కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని రవి ముదిరాజ్ ఆరోపించారు.ఎమ్మెల్యే పాదయాత్రలకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు.గత బీఆర్ఎస్ పాలనలో కమిషన్లపై దృష్టి పెట్టి కొనుగోలు చేసిన వాహనాలు అప్పుడే మూలన పడ్డాయని, ఈ విషయం పట్టణ ప్రజ లందరికీ తెలుసని విమర్శించారు.బీఆర్ఎస్ నాయకుల వీధి నాటకాలను,అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇప్పటికై నా రాజకీయ డ్రామాలు ఆపి,అభివృద్ధికి సహకరించాలని ఆయన హితవు పలికారు.ఈ సమావేశంలో మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీరినాకి నవీన్,జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమూరి రాజు,జిల్లా కార్యదర్శి దొబ్బల వెంకట ప్పయ్య,జిల్లా కార్యవర్గ సభ్యుడు సూరం పల్లి రామ్‌రెడ్డి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు రహీమ్ పాషా,కాంగ్రెస్ నాయకు లు జీవి,వాసంశెట్టి వెంకట్రావు,కొర్లకుంట అప్పారావు,చింతల కృష్ణ,దేశబోయిన లవకుమార్,పొడుతూరి నానాజీ,లఖవత్ రాములు,బత్తుల శ్రీను,పల్లం నాగేశ్వర రావు,మునిగల బిక్షం,గనిబోయిన నాగేశ్వర రావు,చప్పిడి రామసుబ్రహ్మణ్యం, బానోతు లాక్య,బెన్ని ఏలీయా తదితరులు పాల్గొన్నారు.