Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

Author TELANGANA ADDA NEWS | 28 Oct 2026, 04:47 PM | Politics
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ అడ్డా ప్రతినిధి/ బాన్సువాడ:

బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ఈసందర్భంగా బాన్సువాడ గ్రామీణ మండలం కొయ్యగుట్ట తాండలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు మంత్రి సీతక్కభూమిపూజ నిర్వహించారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అలాగే బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింతమెరుగుపరచడంతో పాటు మహిళా సంఘాలకు అవసరమైన వసతులనుఅందుబాటులోకితీసుకురావడానికిదోహదపడనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ, స్థానిక ప్రాంతాల ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఈకార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజు వైస్ చైర్మన్ రేష్మా బేగం ఎజాస్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, ఎమ్మార్వో రాజా నరేందర్ గౌడ్, ట్రాన్స్ కో ఇంచార్జ్ ఎడీ సంతోష్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు కృష్ణారెడ్డి, ఖాలేక్, నార్ల సురేష్, పిట్ల శ్రీధర్, యండి. దావూద్, బాబా, హకీమ్, మున్సిపల్ కౌన్సిలర్లు, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.