Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాదవుల ఐక్యతకు ప్రతీకగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Author TELANGANA ADDA NEWS | 04 Sep 2026, 03:47 PM |
యాదవుల ఐక్యతకు ప్రతీకగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

యాదవుల ఐక్యతకు ప్రతీకగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కరీంనగర్, సెప్టెంబర్ 4 (తెలంగాణ అడ్డా):
అఖిల భారత యాదవ మహాసభ – కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం కరీంనగర్ యాదవ ట్రస్ట్ భవన్‌లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ వేడుకల్లో యాదవ సోదర సోదరీమణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి, యాదవ సమాజం సుఖసంతోషాలతో, ఐకమత్యంతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. యువత, మహిళలు, యాదవ సంఘం సభ్యులు ఆనందోత్సాహాలతో పాల్గొని వేడుకలను సందడిగా మార్చారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తమ్మనవేణి నరసయ్య యాదవ్, కార్యదర్శి ఆవుల మల్లేశం యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సందబోయిన ప్రసాద్ యాదవ్, ముఖ్య అతిథులు 10వ డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య యాదవ్, బుస అంజన్న యాదవ్, ముంజ రాజేందర్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి యాదవ్, చర్ల పద్మ యాదవ్, వైజయంతి యాదవ్, కాల్వ లక్ష్మి యాదవ్, కాల్వ మల్లేశం యాదవ్, కాల్వ శ్రీనివాస్ యాదవ్, కాల్వ లింగయ్య యాదవ్, గాదం శ్రీనివాస్ యాదవ్, జంగ కొమురయ్య యాదవ్, వేల్పుల ఓదెలు యాదవ్, వేల్పుల కొమురయ్య యాదవ్, గొర్ల కొమురయ్య యాదవ్, పొలగని మహేష్ యాదవ్, కొండ రవి యాదవ్, ముక్కెర కొమురయ్య యాదవ్, రాదరపు కుమార్ యాదవ్, సందబోయిన రాజేశం యాదవ్, హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఐక్యతతోనే యాదవ సమాజ అభివృద్ధి

శ్రీకృష్ణుని బోధనలు ధైర్యం, ధర్మం, ఐక్యతను నేర్పిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. యాదవులంతా ఐకమత్యంగా ఉంటేనే సమాజం మరింత బలంగా ఎదుగుతుందని అన్నారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కేవలం పండుగగా కాకుండా యాదవుల ఐక్యత, ఆత్మీయత, సంప్రదాయం, సంస్కృతి, సామాజిక బలానికి ప్రతీకగా నిలిచాయని నిర్వాహకులు తెలిపారు.