Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు అండగా బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి

Author TELANGANA ADDA NEWS | 05 Sep 2026, 08:41 PM |
నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు అండగా బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి

నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు అండగా బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి

కేటీఆర్‌ను కలిసిన బాధితులు.. సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన నేత

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి అండగా నిలిచారు. కరీంనగర్‌లో నిర్వహించిన యువ గర్జన సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నగరంలోని త్రిదా హోటల్‌లో కొత్త జయపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి వారి సమస్యలను వివరించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేటీఆర్‌కు సమగ్రంగా వివరించి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. గ్రామ సమస్యలపై కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు.

బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించి, బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు.

బాధితులకు అండగా ఉంటాం

నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా అండగా నిలుస్తామని కొత్త జయపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సంబంధిత నాయకత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

అనంతరం కరీంనగర్‌కు వచ్చిన నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు కొత్త జయపాల్ రెడ్డి ప్రత్యేకంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.