Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి

Author TELANGANA ADDA NEWS | 05 Sep 2026, 08:52 PM |
ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి

ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి

విద్యార్థులు చెడు వ్యసనాలకు, సైబర్ మోసాలకు దూరంగా ఉండాలి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్‌లోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీపీసీ టీటీఎస్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణకుమార్, సైబర్ నేరాల విభాగం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులే తొలి గురువులని, వారి తర్వాత ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. జీవితంలో ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని విద్యార్థులకు సూచించారు.

చదువు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యలు ఎదురైతే వాటిని దాచుకోకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పంచుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

గంజాయికి దూరంగా ఉండాలి

విద్యార్థులు చెడు వ్యసనాలకు, ముఖ్యంగా గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీపీ హెచ్చరించారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయవద్దని, వ్యక్తిగత వివరాలు, ఓటీపీని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం 112కు కాల్ చేయాలని వివరించారు.

ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని సీపీ ఆకాంక్షించారు.

వినాయక చవితిని పురస్కరించుకుని తెలంగాణ సైబర్ భద్రతా విభాగం రూపొందించిన ‘వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు’ అవగాహన పోస్టర్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ బి. రామ్‌రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐలు ఉదయ్ కిరణ్, శ్రీధర్, సంధ్యారాణి, వెంకట్, ప్రధానోపాధ్యాయుడు జి. జయరాజ్, స్థానిక కార్పొరేటర్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.