Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

1000 రోజుల కాంగ్రెస్ పాలన.. 420 హామీల మోసం! రైతు హామీలు ఎక్కడ? రైతుకు న్యాయం ఎక్కడ?

Author TELANGANA ADDA NEWS | 05 Sep 2026, 08:57 PM |
1000 రోజుల కాంగ్రెస్ పాలన.. 420 హామీల మోసం! రైతు హామీలు ఎక్కడ? రైతుకు న్యాయం ఎక్కడ?

4వ రోజు.. గుమ్మడిదలలో బీఆర్ఎస్ పోరుబాట

1000 రోజుల కాంగ్రెస్ పాలన.. 420 హామీల మోసం!
రైతు హామీలు ఎక్కడ? రైతుకు న్యాయం ఎక్కడ?

గుమ్మడిదల మండల ప్రతినిధి / తెలంగాణ అడ్డా

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా గుమ్మడిదల మండల కేంద్రంలో రైతులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ఎం. సప్పన్నదేవ్, కె. రామచంద్రారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ, డాక్టర్ నర్రా బిక్షపతి పటేల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరుబాట కొనసాగిస్తామని పేర్కొన్నారు.

డాక్టర్ నర్రా బిక్షపతి పటేల్
బీఆర్ఎస్ పార్టీ – పటాన్‌చెరు నియోజకవర్గం