Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష.. నిరంతర బొగ్గు సరఫరాపై దృష్టి

Author Mohammad azeem | 06 Sep 2026, 05:51 PM |
ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష.. నిరంతర బొగ్గు సరఫరాపై దృష్టి

విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష.. నిరంతర బొగ్గు సరఫరాపై దృష్టి

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రజాభవన్‌లో విద్యుత్, ఇంధన శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి బొగ్గు రవాణా ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు ఇంధన, ఆర్థిక శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి తదితర రంగాల నుంచి విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ఇంధన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు సింగరేణి కాలరీస్, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు, ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రధానంగా బొగ్గు రవాణా భద్రత, థర్మల్ విద్యుత్ కేంద్రాల పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యూహాలు, విద్యుత్ సంస్థల ఆర్థిక పునరుద్ధరణ తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.