Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దేశరాజ్‌పల్లిలో నూతన భవనాలకు భూమిపూజ

Author Mohammad azeem | 06 Sep 2026, 05:53 PM |
దేశరాజ్‌పల్లిలో నూతన భవనాలకు భూమిపూజ

దేశరాజ్‌పల్లిలో నూతన భవనాలకు భూమిపూజ

గ్రామపంచాయతీ, విశ్వబ్రాహ్మణ కుల సంఘ భవన నిర్మాణ పనులు ప్రారంభం

చొప్పదండి ప్రతినిధి / తెలంగాణ అడ్డా

ఇవి కూడా చదవండి

చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దేశరాజ్‌పల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం శ్రీకారం చుట్టారు. నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు విశ్వబ్రాహ్మణ కుల సంఘ భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న సమస్యలు, గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన నిధులు మంజూరు చేస్తూ మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను దశలవారీగా చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.