Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ భారీ ఆటో నిరసన ర్యాలీ

Author Mohammad azeem | 06 Sep 2026, 06:02 PM |
మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ భారీ ఆటో నిరసన ర్యాలీ

ఆటో కార్మికుల హామీలు అమలు చేయాలి

మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ భారీ ఆటో నిరసన ర్యాలీ

మహబూబ్‌నగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా

ఇవి కూడా చదవండి

ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, ఆటో కార్మికులు కలిసి మెట్టుగడ్డ నుంచి క్లాక్‌టవర్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని నాయకులు కోరారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం, ఆటో కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఇతర వృత్తిదారులకు అందుతున్న తరహాలో ఆటో కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.